4 April, 2026 | 1:41 AM

సత్తుపల్లిలో గుడ్ ఫ్రైడే

04-04-2026 12:05 AM

సత్తుపల్లి ఏప్రిల్ 3(విజయక్రాంతి): సత్తుపల్లి మండలంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ భక్తులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ప్రభాతకాలంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, పాస్టర్లు యేసుక్రీస్తు శిలువ వేయబడిన సందర్భాన్ని వివరిస్తూ సందేశం అందించారు. అనంతరం విశ్వాసులు శిలువ మోస్తూ పట్టణంలోని పలు వీదుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. భక్తులు కీర్తనలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ యేసుక్రీస్తు ప్రేమ, త్యాగం, క్షమా గుణాలను స్మరించుకోవాలని, సమాజంలో శాంతి, సౌభ్రా తృత్వం నెలకొల్పాలని చర్చి పెద్దలు పిలుపునిచ్చారు.

క్రీస్తు సిలువ యాత్ర

ములకలపల్లి,ఏప్రిల్ 3, (విజయక్రాంతి): శుభ శుక్రవారం (గుడ్ ఫ్రైడే) క్రీస్తు మరణదినమును పురస్కరించుకొని ములకలపల్లి మండలంలోని  క్రైస్తవులం దరూ ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలు అన్నీ జన సందోహంతో నిండిపోయాయి. తెల్లవారు జామున నుండి  క్రైస్తవులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంఘసువార్తికులు, పాస్టర్స్, బోధకులు, క్రీస్తు యేసు మరణంపై ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించి ఆయన మరణము ద్వారా మానవాళికి కలిగినటువంటి విమోచన విడుదల పాపము నుండి రక్షణ అనే విషయాలను సంఘ నాయకులు బోధనల ద్వారా వివరించారు. జీవనజ్యోతి, గుడ్ షఫర్డ్ సంస్థల సిబ్బంది, మండలంలోని పాస్టర్లు ములకలపల్లి లో యేసు క్రీస్తు సిలువ యాత్రను నిర్వహించారు.  పలువురు ప్రముఖులు క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

సులానగర్ ఆర్ సీఎం చర్చిలో ..

టేకులపల్లి, ఏప్రిల్ 3, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం  సులానగర్  గ్రామంలో గుడ్ ఫ్రైడే  సందర్బంగా శుక్రవారం పరిశుద్ధ సిలువ మార్గం  14 స్థలాలలో  యేసు క్రీస్తు వేషధారణలతో  కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా ప్రదర్శనలు నిర్వహించారు. చర్చ్ ఫాదర్ మార్నేని అర్లయ్య  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మార్నేని అర్లయ్య  మాట్లాడుతూ..  గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత పై సంక్షిప్త కథనం ఉందని లోక రక్షకుడైన యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారం కోసం కల్వరి సిలువ పై తన ప్రాణాలను త్యాగం చేసిన రోజనే ’గుడ్ ఫ్రైడే’ గా జరుపుకుంటామన్నారు.

లోకంలోని చెడును అంతం చేయడానికి, మనుషుల పట్ల దేవుడు చూపే అనంతమైన ప్రేమకు చిహ్నం అని యేసు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదని, అది సత్యం, ధర్మం కోసం చేసిన మహోన్నత త్యాగమని అన్నారు. అనంతరం 4O రోజులు ఉపవాసం ఉన్న వారికి దీక్షను విరవింప చేశారు. ఈ కార్యక్రమంలో కొయగూడెం, ముత్యాలంపాడు, ముత్యాలంపాడు క్రాస్ రోడ్, సులానగర్ గ్రామాల నుంచి  అధిక సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. పెద్దలు ఉండేటి బసవయ్య, అంతోటి నాగేశ్వరరావు, కొప్పుల ఫ్రాన్సిస్, ఉండేటి ధర్మరాజు, బల్లెం సురేష్, చింతమల్ల రాములు, కర్లపూడి నాగయ్య, సామ్యేల్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.