4 April, 2026 | 1:49 AM

కొమరయ్య సేవలు ఎనలేనివి

04-04-2026 12:04 AM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరవీరుడు దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం బీసీ సంఘాల నాయకులు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా బిసి అభివృద్ధి అధికారి సోనియా, పట్టణ తహసిల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, బిసి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.