20 June, 2026 | 3:33 AM

హవ్వ.. పెద్దాస్పత్రిలో మందుల్లేవట!

20-06-2026 01:38 AM
  1. ఏరియా ఆస్పత్రిలో మందుల కొరత..
  2. ప్రాణాలతో చెలగాటం..
  3. ఇబ్బందుల్లో పేషెంట్లు
  4. పట్టించుకోని యాజమాన్యం
  5. మౌనవ్రతంలో కార్మిక సంఘాలు 

బెల్లంపల్లి, జూన్ 19 : సింగరేణి కార్మికుల ఆరోగ్య సంక్షేమం సంక్షోభంలో పడిందా..? లేదా కార్మికుల ఆరోగ్యమంటేనే యాజమా న్యం నిర్లక్ష్యం చూపుతోందా..? పై రెండు ప్ర శ్నలకు సమాధానం అవుననే వస్తోంది. అం తే కాదు అయిన వారికి ఆకుల్లో, కానీ వారికి కంచాల్లోనే సామెతను కూడా నిజం చేస్తున్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులు, వారి భా ర్యలు, ప్రస్తుతం పని చేస్తున్న సింగరేణి కార్మికులు ప్రతీ రోజు తప్పనిసరిగా వాడే బీ.పి., షుగర్ మందులు ఇవ్వడం లేదు.

అదే అధికారులకు లోకల్ పర్చెజ్ చేసి ఇస్తున్నారని తెలిసింది. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో బీపీ, షుగర్ మందుల కొరత కలకలం రేపుతుంది. అంత పెద్ద ఆస్పత్రిలో మందుల కొరత ఏర్పడటం అవమానకరం. సింగరేణిలో మెడికల్ విభాగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. సింగరేణి ఆస్పత్రుల ప ర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సింగరేణి మెడికల్ విభాగం ఏర్పాటు చేశారు.

వైద్య సంక్షేమం కోసం రోగులకు ఏలోటు లేకుం డా అన్నిరకాల సేవలను సమకూర్చడం సిం గరేణి వైద్య విభాగం ప్రధాన విధి. కాగా సిం గరేణిలో ఎక్కడా లేనివిధంగా బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక పరిస్థితీ నెలకొనడం ఎవరి వైఫల్యం. అందు కు కారణం చీఫ్ మెడికల్ ఆఫీసర్ కాదా? అన్న అభిప్రాయా లు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య పరిస్థితులు, సరిపడా మందులు, కార్మికుల ఆరోగ్య సంక్షేమంపై ఎప్పటికప్పు డు సింగరేణి ప్రధాన అధికారి, యాజమాన్యం ఆరా తీయాలి. ఇలాంటి బాధ్యను ఉన్నత అధికారులు విస్మరించడం వల్లనే మందుల కొరత, వైద్యుల కొరత ఇతర సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కార్మికులకు పడరానిపట్లు తప్పడంలేదు.

మందుల్లేక తిరుగుముఖం..

ఆస్పత్రికి వెళ్ళున్న పేషెంట్లు మందుల కొరతవల్ల ఖాళీ చేతుల్తో ఇంటి దారి పడుతున్నారు. బీపీ, షుగరు మందుల్లేవని ఫార్మాసిస్టులు ముఖం పట్టుకొని పేషెంట్లకు చెప్పడంతో ఖంగుతినిపోయారు. అయ్యే మందులు లేకపోతే ఎలా అని నిర్ఘాంత పోతున్నారు. రిటైర్డ్ కార్మికులు చాలామంది తమ సొంత గ్రామాల్లో స్థిరపడిపోయారు. సుదూర ప్రాంతాల నుంచి నెలనెలకూ ఏరియా ఆస్పత్రిలో వైద్యం కోసం వస్తుంటారు. ’చావుకబురు చెల్లగా చెప్పినట్టు ’ ఫార్మసిస్టులు ఆస్పత్రికి వచ్చిన పేషంట్లతో మందులు లేవని, తరువాత రండని చెబుతుండటంతో దిక్కుతోచని పరిస్థితికి నెట్టివే యబడ్డారు. 

అసలే అరకొర పెన్షన్లతో బతికే సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఆయా మార్కెట్లో ఈ మందులు కొనుక్కోవలసి వస్తోంది. ఇప్పటికైనా గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు మౌనం వీడి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని రిటైర్డ్, సర్వీస్ కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నాయి.