1 July, 2026 | 10:03 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

2008-డీఎస్సీ బాధితులకు గుడ్ న్యూస్

25-09-2024 12:27 AM

కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): 2008 డీఎస్సీ బా ధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అప్పట్లో 30 శాతం డైట్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మంగళవారం విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులను విడుదల చేసింది.

మినిమం టైం స్కేల్ ఇచ్చి వీరిని ఉద్యోగాల్లో నియమించుకోనున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను అధికారులు చేపట్టనున్నారు. ఆనాటి అభ్యర్థుల్లో కొంత మంది ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఉ ద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండగా, మరో 1500 మంది వరకు ఈ ఉ ద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.