calender_icon.png 16 August, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా శుభారంభం

25-10-2024 12:00:00 AM

కివీస్‌తో తొలి వన్డే

అహ్మదాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో మంధాన సేన 59 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో తేజల్ (42), దీప్తి శర్మ (41), యస్తికా (37), రోడ్రిగ్స్ (35) తలా కొన్ని పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో అమెలియా కెర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంత రం భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. బ్రూక్ హాలిడే (39) టాప్ స్కోరర్. రా ధా యాదవ్ 3 వికెట్లతో రాణించింది.