29 March, 2026 | 4:36 PM

దుష్టసంప్రదాయానికి పునాది వేసిందే మీరు

29-03-2026 02:55 PM

హైదరాబాద్: వివక్షతో కూలాన్ని అవమానిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశంలో గెలిచిన వారిని మంత్రులను చేశారని, పార్టీ ఫిరాయించినవారు ఇవాళ పార్టీ ఫిరాయింపుల గురించి నినాదాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రులను చేశారని, పార్టీ ఫిరాయించిన వారు మహిళ మంత్రి సీతక్కను విమర్శిస్తున్నారని ఆగ్రహించారు.  దుష్టసంప్రదాయానికి పునాది వేసిందే మీరు అని, జాతిపితలమని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు.

మాజీ సీఎం కేసీఆర్ రూ.కోటి పది లక్షలు జీతం తీసుకుని సభకు రావడం లేదని, సభకు రాకుండా ఇంట్లో ఉన్న ఆయన రాజీనామా చేయడంట.. జీతం వాపసు ఇవ్వడంట అని ముఖ్యమంత్రి విరుచుపడ్డారు. రోజు 18 గంటలు పని చేసే పొంగులేటి రాజీనామా చేయాలా..?, మీరు చెప్పింది వినకుంటే మంత్రి రాజీనామా చేయాలా..?, మీ తాతలు దిగివచ్చినా మంత్రి రాజీనామా చేయడం జరగదు అని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్షంగా ఏ అంశానైనా వాళ్లు ప్రస్తావించవచ్చు, నిరసన చేయవచ్చు, తాము అన్నట్టే ప్రభుత్వం నడవాలనే మీ ఆలోచన ఉపసంహరించుకోవాలని సీఎం సూచించారు.

ప్రజా జీవితంలో నుంచి వచ్చిన కడియం శ్రీహరి కూడా కేసీఆర్ కు సరిసమానమైన ప్రజా ప్రతినిధి అని, కడియం శ్రీహరి నిజాయితీ, నిబద్ధతను ఈ దేశంలోనే ఎవరూ ప్రశ్నించలేరని చెప్పారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తనను కేటీఆర్, హరీష్ రావు సమర్థిస్తారా..? అని, ఈ విధానాన్ని ఇక్కడే నిలువరించి సభ్యులు చర్చలో పాల్గొని సహకరిస్తే వారిని సభలో కొనసాగించండని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను రేవంత్ రెడ్డి  కోరారు. కౌశిక్ రెడ్డిపై ప్రత్యేక చర్యలు తీసుకోని ఎథిక్స్ కమిటీకి పంపించాలని, సభా సజావుగా సాగేందుకు సహకరించని బీఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేయాలని సీఎం తెలిపారు.