25-10-2024 12:00:00 AM
బంగ్లాపై విజయం
మీర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజ యం సాధించింది. తద్వారా సౌతాఫ్రికా ఆసియా గడ్డపై పదేళ్ల తర్వాత టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. అంతక ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. రెండో టెస్టు ఈ నెల 29 నుంచి మొదలుకానుంది.