16 August, 2026 | 3:26 PM

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం

17-06-2024 10:59 AM

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం అగర్తల నుంచి సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో గూడ్స్ బోగీలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ప్రమద స్థలంలో రైల్వే అధికారులు సహాయ చర్యలు చేపట్టినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి తెలిపారు. రెండు రైళ్లూ ఒకే ట్రాప్ పై వచ్చాయని స్థానికులు తెలిపారు. ఈ దుర్ఘటన రంగపాణి-నిజ్బారి స్టేషన్ల మధ్య  జరిగినట్లు అధికారులు తెలిపారు.