ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్ రైలు: ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు
17-06-2024 11:33 AM
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి స్టేషన్‌కు సమీపంలో సోమవారం సేల్దా నుంచి వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో 30 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. న్యూజల్ పాయ్ గుడిలో కాంచన్‌జంగా ఎక్స్ ప్రెస్ ను గూడ్స్ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. గూడ్స్ ఢీకొన్నాక కాంచచజంగ ఎక్స్ ప్రెస్ 2 వెనుక బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలంలోనే బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాద స్థలంలో రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.






