నదిలోకి తీసుకెళ్లిన గూగుల్ మ్యాప్స్
కాసరగోడ్, జూన్ 30: కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు చిరునామాలు తెలుసుకొనేందుకు జీపీఎస్ వాడటం, అవి తప్పుడు అడ్రస్‌కు తీసుకెళ్లటం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు కేరళలో గూగుల్ మ్యాప్స్ సాయంతో అడ్రస్ వెదుక్కొంటూ వెళ్లగా అది సరాసరి ఓ చెరువులోకి తీసుకెళ్లింది. తాజాగా కూడా అదే రాష్ట్రంలో గూగుల్ మ్యాప్ కొందరిని ఏకంగా నదిలోకి తీసుకెళ్లింది. కాసరగోడ్ జిల్లాలోని పొల్లాంచిలో ఇద్దరు వ్యక్తులు గూగుల్ మ్యాప్స్ సాయంతో ఓ దవాఖాన చిరునామా వెదుక్కొంటూ కారులో వెళ్తుండగా.. అది సరాసరి వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి దారితీసింది. బాధితులు అలాగే ముందుకెళ్లటంతో కారు నీటిలో కొట్టుకుపోయింది. కొద్ది దూరం అలా వెళ్లి ఓ చెట్టుకు తాకి కారు ఆగిపోవటంతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఫైర్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వాళ్లు వచ్చి కారును బయటకు లాగారు.






