10 July, 2026 | 12:52 PM

విపక్ష డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్!

01-07-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 30: లోక్‌సభలో స్పీకర్ ఎన్నిక ముగియటంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై అందరి దృష్టి పడింది. ఈ పదవిని విపక్షాలకు ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నది. అందుకు అధికార ఎన్డీయే సుముఖంగా లేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్‌ను పోటీలోకి దింపాలని విపక్షాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయోధ్య రామాలయం ఫైజాబాద్ పరిధిలోనే ఉన్నది. అవధేశ్‌కు తృణమూల్ కాంగ్రెస పార్టీ కూడా మద్దతు ప్రకటించింది.