14-10-2025 01:45:19 PM
హైదరాబాద్: గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( AP Government) చారిత్రక ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్(Google) తో ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒప్పంద పత్రాలపై గూగుల్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నిర్మల సీతారామన్, అశ్వివీ వైష్ణవ్, నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. రూ. 87, 520 కోట్ల పెట్టుబడులతో గిగావాట్ కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.
వైద్యం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాల్లో సేవలు చేయనుంది. 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహకారంతో అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో పెడుతున్నామని, వచ్చే ఐదేళ్లలో విశాఖలో గూగుల్ పెట్టే పెట్టుబడి $15 బిలియన్ డాలర్లని గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియన్(Google Cloud CEO Thomas Kurian) వెల్లడించారు. గతంలో హైదరాబాద్‍లో హైటెక్ సిటీ అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‍గా తీర్చిదిద్దబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) అన్నారు. ఆనాడు హైదరాబాద్‍కు మైక్రోసాప్ట్ తీసుకొచ్చాం.. ప్రస్తుతం విశాఖకు గూగుల్‍ను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.