14-10-2025 03:04:45 PM
న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్రంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (National Democratic Alliance) సీట్ల పంపకాల ఒప్పందంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Elections) 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఇద్దరూ ఉన్నారు. సామ్రాట్ చౌదరిని తారాపూర్ నుంచి పోటీ చేయగా, విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలో ఉన్నారు. మంత్రి నితిన్ నాబిన్(Minister Nitin Nabin) బంకీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. రేణూదేవి భటియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న లెక్కింపు జరుగుతుంది.