వినోదం పంచే ముగ్గురు కోతులు
30-08-2026 12:34 AM
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేశ్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ మూవీ నుంచి మేకర్స్ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
‘ముగ్గురు కోతులు’ అంటూ సాగిన ఈ వీడియో సాంగ్‌లో ముగ్గురు హీరోలు ఫుల్ ఎం జాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్‌గా సినిమా రానుందని ఈ పాటను చూస్తేనే అర్థం అవుతోంది. సంగీత దర్శకుడు ఎస్ సుహాస్ స్వరపర్చిన ఈ పాటను జగదీష్ బుసయవలస రాయగా, చైతన్య గన్నవరపు పాడారు. ఈ సినిమాకు రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.






