17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

థ్రిల్లర్ కథకు గోపీచంద్ శ్రీకారం

25-04-2025 12:00 AM

హీరో గోపీచంద్ మరో సినిమాను మొదలుపెట్టేశారు. శ్రీవేంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. గోపీచంద్ ‘సాహసం’ తర్వాత మరోమారు ఈ బ్యానర్‌లో చేస్తున్న సినిమా ఇది. ఈ ప్రాజెక్టు గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో కుమార్‌సాయి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, భారీ బడ్జెట్‌తో, అత్యుత్తుమ నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మలయాళ నటి మీనాక్షి దినేశ్ ఇందులో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు.

శామ్‌దత్ డీవోపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమా నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.