కాలభైరవ స్వామికి ఘనంగా అభిషేకం, సింధూర పూజలు
21-07-2026 05:45 PM
రామారెడ్డి,(విజయక్రాంతి): ఇసనపల్లి రామారెడ్డి గ్రామాల్లో గల శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకం, సింధూర పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.






