7 July, 2026 | 12:58 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

మరో ఏడు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు

31-08-2024 01:30 AM
  1. మొత్తం 39 మార్కెట్ కమిటీలను నియమించాం
  2. మంత్రి తుమ్మల 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): మరో ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన చైర్మన్, వైస్ చైర్మన్లతోపాటు పాలకవర్గాన్ని నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిందని పేర్కొన్నారు.

వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 39 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందన్నారు. మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ, జిగిత్యాల జిల్లాలలోని వెల్గటూరు, కామారెడ్డి జిల్లాలో గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. 

మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్‌చైర్మన్

మహబూబ్‌నగర్ బెక్కరి అనితారెడ్డి గడుగు విజయ్‌కుమార్

వెల్గటూరు గుండటి గోపిక గొల్ల తిరుపతి

గాంధారి బండారి పరమేశ్వర్ ఆకుల లక్ష్మణ్

సదాశివనగర్ మాలోతు సంగ్య జక్కుల రాజారెడ్డి

ఎల్లారెడ్డి మారెడ్డి రజిత జొన్నల రాజు

నేలకొండపల్లి వెన్నపూసల సీతారాములు కొండపర్తి సురేశ్

మద్దలపల్లి బైరు హరినాథబాబు వనవాసం నరేందర్‌రెడ్డి