30 August, 2026 | 10:09 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకనే..

31-08-2024 01:33 AM

ఎమెర్జెన్సీ సినిమా పేరుతో బీజేపీ నాటకాలు

కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రధాని మోదీ.. ఇందిరాగాంధీ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు వినయ్‌కుమార్, లింగంయాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను పెట్టి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన పెద్దలు ఎమర్జెన్సీ పేరిట సినిమా తీస్తున్నారని.. దీని ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్‌ను దెబ్బతీయటమే అని కోదండరెడ్డి ఆరోపించారు.

ఎమెర్జెన్సీ సినిమా విడుదలను నిలిపివేయాలని ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమెర్జెన్సీ ఎందుకు పెట్టారో ప్రజలందరికీ తెలుసని.. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎమర్జెన్సీని సమర్థించిందన్నారు. ఎమర్జెన్సీ పేరిట సినిమా తీసి ప్రజలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కోదండరెడ్డి విమర్శించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. బీజేపీ మాయలో వారు పడరన్నారు.