నిధుల కోసం ఎమ్మెల్యేను కలిసిన పాలకవర్గం
చేగుంట, జూన్ 17 : చేగుంట పట్టణ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని చేగుంట పాలక వర్గ సభ్యులు, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ని కోరారు. బుధవారం పట్టణ కేంద్రంలోని అలీ నివాసంలో కలిసి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
పట్టణ కేంద్రం ఉన్న ప్రధాన సమస్యలు మురికి కాలువలు, సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీ, సులబ్ కాంప్లెక్స్, పట్టణానికి మంజూరైన రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఫీ, మొహమ్మద్ ఆరీఫ్, రహిమోద్దీన్,రవి, వంశీ, ఉదయ్, సుకెందర్, అలీ పాల్గొన్నారు.
షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న ‘సర్కార్ బాయి‘ తెలుగు సినిమా షూ టింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూ నిట్ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మూవీ షూటింగ్కు క్లాప్ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, ని ర్మాత రాంరెడ్డి, డైరెక్టర్ లారా, హీరో శ్రీరామ్, హీరోయిన్ హర్షిక, సర్పంచ్ నర్సింహా, మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ్ రావు, వివిధ పార్టీల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, నారాయణ రెడ్డి, ఉపసర్పంచ్ స్వామి, ప్రజాప్రతినిధులు బాలచందర్, జ్ఞానేశ్వర్, హరిశంకర్ పాల్గొన్నారు.






