calender_icon.png 7 February, 2026 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లు.. రూ.20వేల కోట్లు!

07-02-2026 01:44:23 AM

హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం కేటాయింపులు

  1. ప్రపంచ మేటి నగరాలతో భాగ్యనగరం పోటీ
  2.  27 మునిసిపాలిటీల విలీనం చారిత్రాత్మక నిర్ణయం
  3. క్రెడాయ్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం
  4. క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  5. రియల్ ఎస్టేట్ రంగానికి వెన్నుదన్నుగా సర్కార్   
  6. రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్ర జా ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే రూ. 20 వేల కోట్లు కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో అనేక పనులు పూర్తికాగా మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని, ఈ తరహాలో హైదరాబాద్ నగర అభివృద్ధికి ని ధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఎన్న డూ జరగలేదని తెలిపారు.

శుక్రవారం హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షో సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ  జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 1950.52 కోట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పరిధిలో రూ. 12,500 కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ. 4,365 కోట్లు కేటాయించినట్లు వివరించారు. హైదరాబాదు నగరం పెట్టుబడులు, ప్రతిభ, జీవ న ప్రమాణాల్లో నాణ్యత విషయంలో దేశంలోని నగరాలతోనే కాదని ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడుతుందని తెలిపారు.

విలీనం.. చారిత్రాత్మక నిర్ణయం

నగరం చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు. ఈ గొప్ప నిర్ణయం ద్వారా నగరంలోని పౌ రులకు ఒకే విధమైన పౌర సేవలు, సమగ్ర ప్రణాళిక, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒకే అభివృద్ధి దృక్పథం సాధ్యం అయ్యాయన్నారు. హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, పెట్టుబడులకు అనుకూలమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తోందన్నారు.

నగరాభివృద్ధి అనేది న్యాయమైనది, సమతుల్యమైనది, అందరికీ అందుబాటులో ఉండాలనే మా నమ్మకాన్ని మున్సిపాలిటీల విలీనం ప్రతిబింబిస్తుందన్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం కింద రూ. 7,032 కోట్లకు పైగా పెట్టుబడితో 45 ప్రధాన ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, 10 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని వివరించారు. 

‘రియల్ ’కు వెన్నుదన్నుగా..

రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు నందించడంతో పాటు నిర్మాణ రంగదారులకు అనువైన పద్ధతిలో చేయూత నందిస్తుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంద న్నారు.

అందుకు సంబంధించిన అనుమ తుల ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటు నీటిపారుదల శాఖ అనుమతుల్లో జాప్యాన్ని సత్వరమే పరిష్కరిస్తామని భరో సా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి  నేతృత్వంలోనీ రాష్ట్ర ప్రభుత్వం క్రెడాయ్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. అదే సమయంలో నిర్మణారంగ అభివృద్ధికి అవసరమైన సలహాలు,సూచనలు చేసేందుకు నిర్మాణరంగా నికి ముం దుకు రావాలని పిలుపునిచ్చారు. 

అవకాశాలు పుష్కలం : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, భారతదేశంలో రియల్ ఎస్టేట్ వృద్ధికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే వలసలు అతిపెద్ద చోదక శక్తిగా కొనసాగుతున్నాయని తెలిపారు. గృహాలకు మాత్రమే కాకుండా ఆతిథ్యం, రిటైల్, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు కూడా డిమాండ్ సృష్టిస్తున్నాయని విశ్లేషించారు.

రాబోయే 15 నుంచి 20 సంవత్సరాలలో, భారతదేశం అపూర్వమైన రీతిలో పట్టణ వలసలను చూడనుందని , ఇది చైనా పరివర్తనతో పోల్చదగినదని చెబుతూ , ఈ రంగానికి గణనీయమైన అవకాశాలను అది అందిస్తుం దని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దాని నిర్మాణాత్మక బలం, దీర్ఘకాలిక స్థిరత్వం  కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నిలుస్తోందని  క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ ఎన్. జైదీప్ రెడ్డి తెలిపారు. 

స్థిరమైన విధాన దిశానిర్దేశం, చురుకైన పాలన  భౌతిక , సామాజిక మౌలిక సదుపాయాలలో స్థిరమైన పెట్టుబడుల నుంచి నగరం ప్రయో జనం పొందిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నేడు  ఉపాధి అవకాశాలు విస్తరిం చడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి బలమైన విలువ ప్రతిపాదనను అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్  ఎలెక్ట్  శ్రీ బి. జగన్నాథ్ రావు,  జనరల్ సెక్రటరీ శ్రీ క్రాంతి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా..

హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందేందుకు అవసరమైన మార్పులు చేర్పులకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ రంగంతో పాటు ఐటీ పరిశ్రమలు, పర్యాటకం తదితర రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, గోదావరి,కృష్ణా జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగు నీటి సరఫరా వేసిన ఉదంతాలను ఉటంకించారు. అదే సమయంలో నిజాం కాలం నుండి వారసత్వ సంపదగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయ వ్యవస్థను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ నియంత్రణ పనులకు రూ.1090కోట్లు

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని ప్రాజెక్టులు ట్రాఫిక్ రద్దీని రూ. 1090 కోట్లు వెచ్చించి నియంత్రణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఉత్తర భాగంలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు రూ.960 కోట్లతో పనులు, తూర్పు హైదరాబాద్‌లో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రూ 416 కోట్లతో పనులు, దక్షిణ భాగంలో, వేగంగా విస్తరిస్తున్న పట్టణాభివృద్ధికి రోడ్డు విస్తరణ ప్రాజెక్టులను రూ .863 కోట్లతో చేపట్టినట్టు వివరించారు.

తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కింద క్యూర్, ప్యూర్, రేర్ వ్యూహం రాష్ట్ర అభివృద్ధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని కేంద్రంగా ఉంచుతోందని తెలిపారు. 2047 వరకు దృష్టిలో ఉంచుకుని, వరదల భద్రత, వాతావరణ అనుకూలత కోసం ప్రత్యేకంగా లోతట్టు, వెనుకబడిన ప్రాంతాలకు ఉపయోగపడేలా సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు.  దేశంలోనే అత్యంత నివసించదగిన, పెట్టుబడులకు అనుకూలమైన, మంచి పాలనతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.