పోటీ పరీక్షల అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ
విద్యార్థులకు విద్యే గొప్ప ఆస్తి
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టా సతీష్
చుంచుపల్లి,(విజయక్రాంతి): సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కట్టా సతీష్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లా గ్రంథాలయ లైబ్రేరియన్ మణి మృదుల, ఆర్ఎల్డి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ పృథ్వి నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు కష్టపడి సిద్ధమై ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం చంద్రుగొండ మండలం రేపల్లెవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల అధ్యక్షుడు పసుపులేటి వీరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోట్‌బుక్ పంపిణీ కార్యక్రమానికి కట్టా సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి మాట్లాడుతూ, విద్యే జీవితాన్ని మార్చగల గొప్ప ఆయుధమన్నారు. పేద విద్యార్థులకు విద్య అందించడం నిజమైన సామాజిక సేవ అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.






