1 August, 2026 | 10:01 PM

ఐఓసీ కార్యాలయంలో బహిరంగ వేలం

01-08-2026 09:10 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలోని ఇంటిగ్రెటెడ్  కార్యాలయ సముదాయంలో గల మూడు శెట్టర్స్ రెండు పెద్దవి  ఒక్కోటి అద్దె నెలకు 5000/- రూపాయలు, చిన్న శెటర్  అద్దె నెలకు  3000/- రూపాయలు, కాంటీన్ కనిష్ఠ అద్దె 8000/- రూపాయలు, నిర్ణయించినట్లు తహాశీల్దార్ నిర్మల తెలిపారు. వేలంలో పాల్గొనాలి అనుకున్న వారు ఆగస్టు 03వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ లోపు వ్రాత పూర్వకంగా తహాశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు.

ఆగస్టు 20వ తేదీ రోజు ఉదయం బహిరంగ వేలం ఉంటుంది అన్నారు. వేలంలో గారిష్ట అద్దె చెల్లించిన వారికీ అవకాశం కల్పించబడును అని తెలిపారు. వేలం లో శెటర్స్ దక్కించుకున్న వారు బిడ్ రూపాయలు ఆరు నెలల అడ్వాన్స్ ఆగస్టు 30 వ తేదీ లోపు చెలించాలి అని చెల్లించని యెడల హక్కులు రద్దు చేయబడును అని తెలిపారు.షరతులు వర్తిసాయి అని సూచించారు.