1 August, 2026 | 10:06 PM

మెట్‌పల్లిలో టిపివో అవినీతిపై విచారణ

01-08-2026 09:07 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): గతంలో మెట్ పల్లి పట్టణ టిపివోగా పని చేసి అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన రాజేంద్ర ప్రసాద్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై శనివారం వరంగల్ ఆర్డిడి పట్టణంలో విచారణ చేపట్టారు. ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇస్తామని చెప్పి డబ్బులు వాసులు చేశారనే ఆరోపణలపై సంబందించిత అధికారులు, సిబ్బందితో పాటు పర్మిషన్ పత్రాలను సేకరించారు. వరంగల్ అధికారులు సేకరించిన సమాచారం మేరకు టిపివో పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.మెట్ పల్లిలో టిపివో గా రాజేంద్ర ప్రసాద్ పని చేసిన కాలంలో ఇచ్చిన ఇంటి నిర్మాణ అనుమతులపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపితే మరింత అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉందని విచారణ సందర్బంగా పలువురు పేర్కొనడం జరిగింది.