17 April, 2026 | 3:48 PM

Breaking News

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •  

గోహత్య నిషేధ చట్టాల అమలులో ప్రభుత్వం విఫలం

13-06-2025 12:00 AM

విశ్వహిందూ పరిషత్ 

ఖైరతాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : గో హత్య నిషేధ చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫల మైందని  విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ తెలిపింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో నాయకులు రావినూతల శశిధర్, రామరాజు, రమే ష్, జగదీశ్వర్, చింతల వెంకన్న, పగుడాకుల బాలస్వామి హాజరై మాట్లాడారు. మజిలీస్ పార్టీ మెప్పు పొందేందుకు  కాంగ్రెస్ ప్రభు త్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు.

ఇటీవల జరిగిన బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అవలంబించిన తీరు హిందూ మనోభావాలను దెబ్బతీశాయన్నారు. గో రక్షణ కోసం ఏర్పాటుచేసిన చెక్ పోస్టులు విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గోవు ప్రేమికులైన దళితులపై దా డి చేసి తీవ్రంగా హింసించారని, పోలీసులు వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు హిందువులను తీవ్రంగా కలిసి వేశాయని అన్నారు. హిందూ, దళిత వ్యతిరేక విధానాలపై జరుగుతున్న అనేక వ్యవహారాలన్నీ దృష్టిలో ఉంచుకొని న్యాయ పోరాటం చేస్తామని  తెలిపారు. సమావేశంలో నాయకులు జస్వంత్, అనిల్, దీపక్, ఎస్సీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్, నాయకులు సుమన్, అరవింద్, ఉప్పల నరసింహ, ధీరజ్ పాల్గొన్నారు.