18-02-2026 12:22:38 AM
విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, ఫిబ్రవరి 17,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి యువతియువకుల యూత్ వాలీబాల్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలింపిక్ జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, రాష్ట్రజిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం కప్ ద్వారా ప్రతిభావంతులను వెలికితీస్తున్నామని తెలిపారు. వేములవాడలో స్టేడియం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.