calender_icon.png 18 February, 2026 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 25 సవరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం

18-02-2026 12:22:28 AM

  1. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కుట్రను తిప్పికొడతాం 

తపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్

సిద్దిపేట, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి):జీవో నంబర్ 25ను సవరించకుండా హేతుబద్ధీకరణ చేపడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, పేద విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడే ఏ నిర్ణయాన్నీ తపస్ సహించదని ఆయన హెచ్చరించారు.

మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ విస్తరణ సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఆబిటేషన్లో ప్రభుత్వ పాఠశాల ఉండాలనే డిమాండ్తో గళమెత్తి అధికారంలోకి వచ్చినక ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని అన్నారు.

హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయాలనే కుట్రను తిప్పికొట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ.

2010కి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించేందుకు తపస్ రాష్ట్ర శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోందన్నారు. అనంతరం తపస్ జిల్లా అధ్యక్షునిగా చిలుముల మురళీధర్ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ నర్సిరెడ్డి, రాష్ట్ర బాధ్యులు బీరకాయల తిరుపతి, పబ్బతి శ్రీనాకర్ రెడ్డి, సింగోజు జనార్ధన్, క్యాతం మహేందర్ రెడ్డి,

చిట్టిమల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులుగా ముండ్రాతి రాములు, గంట్యాల వెంకటేశం, గడీల శ్రీకాంత్, అనుముల వీరేశం, ఎండబెల్లి గోపాల్ రెడ్డి, భాస్కరాచారి, వీరారెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.