18-02-2026 12:24:07 AM
ముకరంపుర, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): పోరాటల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు, స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగనిపోరాటం చేసిన ఉద్యమ వీరుడు జనహృద యనేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు అన్నారు. మంగళవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో సంబరాలను నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి స్థానికులకు బాటసారులకు పూల మొక్కల తో పాటు మిఠాయిలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మళ్లీ వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జివి.రామకృష్ణ రావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ , కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ- శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.