18 June, 2026 | 4:18 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మద్ది చంద్రకాంత్ రెడ్డి

18-06-2026 02:52 PM

భిక్కనూర్, జూన్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ శ్యామ్, వీడీసీ కార్యదర్శి నాగర్తి భూమ్‌రెడ్డి, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.