18 June, 2026 | 4:26 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

సీఎం క్యాంప్ ఆఫిస్ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

18-06-2026 02:50 PM

నేరేడుచర్ల, జూన్ 18(విజయక్రాంతి): అక్రమ అరెస్టులతో ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని కొనసాగించలేవని,సీఎం క్యాంప్ ఆఫిస్ ముట్టడికి వెళ్తున్న నేరేడుచర్ల మండల బి.ఆర్.ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ చేసిన సందర్బంగా వారు, మాట్లాడుతు,ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, దోచుకుని దాచుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు కావలసినటువంటి సంక్షేమం, రాష్ట్రాన్ని కావలసినటువంటి అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుని , ప్రశ్నిస్తున్న  తెలంగాణ ప్రజలు(people of Telangana) అమాయకులు కారని,ఉద్యమం నుంచి పాలన దాకా అన్నింటినీ చూసిన రాజకీయంగా చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు విఫలమైన రేవంత్ సర్కారు పాలనలో పూర్తిగా ఎన్ని అటెన్షన్, డైవర్షన్ డ్రామాలకు పాల్పడినా ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టుడు ఖాయమన్నారు.అరెస్ట్ అయిన వారిలో మాజీ మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్. మాజీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు. లావుడ్యా శ్రీను నాయక్. మాజీ టౌన్ ఉపాధ్యక్షులు. చిట్యాల శ్రీను. సీనియర్ నాయకులు ఇనుపాల పిచ్చి రెడ్డి. జింకల భాస్కర్. తదితరులు ఉన్నారు.