18 June, 2026 | 4:18 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

ఏబీవీపీ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం ముట్టడి

18-06-2026 02:53 PM

ముకరంపుర, జూన్ 18(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా అలాగే విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీ వీపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా విద్యాధికారి  కార్యాలయాన్ని  ముట్టడించారు.ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఏబీవీపీ  కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, ఫర్నిచర్ మరియు ఇతర విద్యా సౌకర్యాల లోపంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త విద్యా సంవత్సరం విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు మరియు ఇతర విద్యా సామగ్రి అందేలా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని పేర్కొన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పేద మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుటుతాం అని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో స్టేట్ హాస్టల్స్ కో-కన్వీనర్ , స్టేట్ SFD కో-కన్వీనర్ ,తదితరులు పాల్గొన్నారు.