21 April, 2026 | 9:24 PM

రైతులను మళ్లీ మోసం చేసిన సర్కార్

21-04-2026 08:04 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఒక ఎకరం మాత్రమే పెట్టుబడి సాయం రైతు ఖాతాలో  వేశారని టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మార్కొండ రాము ఆరోపించారు. కెసిఆర్ జగిత్యాల ప్రజా దీవెన సభ పెట్టడంతోనే ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సహాయానికి ముందుకు వచ్చిందని అయితే ఒక ఎకరం మాత్రమే పెట్టుబడి సాయం అందించడంపై రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. జిల్లాలో రైతులు పంట  కోసం రోడ్డు ఎక్కుతున్న అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.