28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

10-03-2026 12:47 AM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి, మార్చి 9 (విజయక్రాంతి): మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ముస్లీం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.

జగిత్యాల జిల్లాలో 590 మంది మహిళలు కుట్టు మిషన్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 590 మంది మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని మిగిలిన వారికి 99 రోజుల ప్రజాపాలన - ప్రణాళికలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో మైనార్టీ రుణాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడి రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 99 రోజుల ప్రణాళికలో గ్రామ, పట్టణాలలో ఉన్న సమస్యలను పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు.

గల్ఫ్ బాధితుల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకో వడానికి ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేస్తుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.