28 June, 2026 | 2:08 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

వైద్యరంగ అభివృద్ధికి బాటలు

10-03-2026 12:46 AM

షాద్నగర్ ఆసుపత్రికి  రూ. 5.31 కోట్లు

షాద్నగర్/కేశంపేట (విజయక్రాంతి): నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా షాద్నగర్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీకారం చుట్టారు. అలీసాబ్ గూడ వద్ద నిర్మిస్తున్న నూతన ఆసుపత్రిలో అదనపు సదుపాయాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5.31 కోట్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఆసుపత్రిలో ప్రహరీ గోడ, సీసీ రోడ్లు, మోడ్రన్ కిచెన్, మెడికల్ ల్యాండ్రీ, మార్చురీ భవనం మరియు బయో వేస్టేజ్ మేనేజ్మెంట్ వంటి పనులను చేపట్టనున్నారు.

కేశంపేటలో మెగా వైద్య శిబిరం..

‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కేశంపేటలో అర్థంతరంగా ఆగిపోయిన ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో డాక్టర్ విష్ణువర్ధన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.