16 April, 2026 | 6:33 AM

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

25-11-2025 12:00 AM
  1. సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి

బోథ్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

ఆదిలాబాద్, బోథ్, నవంబర్ 24 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడమ బొజ్జు పటేల్ లతో కలిసి పాల్గొన్న మంత్రి ఆదిలాబాద్ లో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన దివ్యాంగుల సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

అదేవిధంగా సోనాల మండల కేంద్రంలో రూ. 3.55 కోట్ల రూపాయల STSౄF నిధులతో గుడిహత్నూర్ నుండి లింగపూర్ మీదుగా మంకాపూర్ వరకు బీటీ రోడ్డు, రూ.93.6 లక్షలతో సోనాల మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణా పనులకు మంత్రిశంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ బోజరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామల దేవి, ఐటిడిఏ పీవో యువరాజ్, డీఆర్డీఓ రవీందర్, ఆర్డీఓ స్రవంతి, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.