calender_icon.png 24 November, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జల శక్తి జల్ అభియాన్‌ లో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సెక్రటరీ

24-11-2025 10:39:51 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): జల శక్తి జల్ అభియాన్‌ లో బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామపంచాయతీకి గౌరవం దక్కింది. జల శక్తి జల్ అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరచినందుకు సోమవారం మోరంపల్లి బంజర గ్రామపంచాయతీ సెక్రటరీ బి.భవాని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ భవానికి మోరంపల్లి బంజర గ్రామపంచాయతీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సెక్రెటరీ భవాని మాట్లాడుతూ సెక్రటరీగా తన విధి నిర్వహణలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపిఓ సునీల్ శర్మ అందించిన సలహాలు, సూచనలు ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

గిరిజన గ్రామాల్లో సైతం తాగునీరు అందించడానికి ఎంపీడీవో, ఎంపీవో, తన సహచర సెక్రటరీలు పడిన కృషిని మర్చిపోలేనన్నారు. జల శక్తి అభియాన్ అనేది భారతదేశంలో నీటి సంరక్షణ, నిర్వహణను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక మిషన్-మోడ్ ప్రచారం అని తెలిపారు. నీటి కొరత ఉన్న జిల్లాల్లో నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, నీటి పునర్వినియోగం, వాటర్‌షెడ్ అభివృద్ధి వంటి ఐదు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. 2019లో ప్రారంభమైన ఈ ప్రచారంలో పౌరుల భాగస్వామ్యం కీలకంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.