మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్ పల్లి : మే 27( విజయ క్రాంతి): మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం చిరు వ్యాపారులకు ఉదయం పోస్టల్ యందు రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద మహిళలను కోటీశ్వరులను చేసేందుకు పెద్ద ఎత్తున మహిళా రుణాలను అందించడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమందిస్తుందని, అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతుబంధు డబ్బులను వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని వివరించారు.
గ్రామాల్లో అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, మంచినీటి వసతి కోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేష్, మేనేజర్ అంజన్ కుమార్, టిఎంసి వినోద్ కుమార్,వైస్ చైర్ పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు ఆనందరావు, భానూరి కృష్ణ, పర్వేద సర్పంచ్ సురేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి, మాజీ సర్పంచులు రవీందర్ గౌడ్, పొడవు శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






