మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
28-05-2026 12:00 AM
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్, మే 27 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రతి మహిళను కోటీశ్వరురాలని చేయడమే లక్ష్యంగా ముం దుకు సాగుతోందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నా యక్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ ని యోజకవర్గంలోని నర్సింహులపేట మండలంలోక్యతండ, దంతాలపల్లి మండలం బీరు శెట్టి గూడెం గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘం భవనాలకు ఆయన శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాల ను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అందిపుచ్చుకొవాలని ఆకాంక్షించారు.






