కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఐక్యంగా కృషి చేయాలి
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
మేడ్చల్, మే 27(విజయ క్రాంతి): వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నాయకులు కార్యకర్తలు ఐక్యం గా కృషి చేయాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం అంతాయిపల్లిలోని ఎస్‌ఎన్‌ఆర్ గ్రాండ్ కన్వెన్షన్ హాలు లో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కాం గ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ పై నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
బి ఎ ల్‌ఏల నియామకం, ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. డివిజన్ నూతన కమిటీలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఐక్యంగా పనిచేస్తామని, చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి డిసిసి అధ్యక్షుడు వజ్రాష్ యాదవ్ అధ్యక్షత వహించగా, టిపిసిసి ప్రధాన కార్యదర్శులు సమీర్, మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజీబుద్దిన్, మహిపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






