1,800 కోట్ల ప్రభుత్వ భూమి 300 కోట్లకే విక్రయం
మహారాష్ట్ర మంత్రి ప్రతాప్‌పై ఆరోపణలు
ముంబై, నవంబర్ 8: మహారాష్ట్రలో భూకుంభకోణం కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ రూ.1,800 కోట్ల విలువైన భూ మిని రూ. 300 కోట్లకే దక్కించుకున్నారని చేసిన కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ మీరా భ యాందర్‌లో దాదాపు రూ.1,800 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని రూ.300 కోట్లకే కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ స్థలంలోనే ఆయన ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ ఆరోపణలపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పందించారు. ఈ విషయం గురించి తాను కూడా విన్నానని, కానీ దీనిపై ఎవరి దగ్గరి నుంచి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రతిపక్షాలు తమకు ఫిర్యాదు చేయడం మానేసి, మీడియా ముం దుకు వచ్చి ఆరోపణలు చేసేందుకే సమ యం కేటాయిస్తున్నాయని విమర్శించారు. ఈ భూమికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కాగా 1,800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అజిత్‌పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజెస్ రూ.300 కోట్లకే విక్ర యించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూ కుంభకోణం కేసుపై దర్యాప్తునకు ఓ బృందాన్ని నియమించింది. విచారణలో దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి దే వేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి ప్రతాప్ సర్‌నాయక్‌పై కూడా ఇలాంటి ఆరోపణలే రావడం సంచలనంగా మారింది.




