calender_icon.png 9 November, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్

09-11-2025 01:28:02 AM

ధ్రువీకరించిన ఆఫ్రికన్ ప్రభుత్వం

మాలీ, నవంబర్ 8: ఆఫ్రికాలోని పశ్చిమ మాలి కోబ్రీ సమీపంలో ఐదుగురు భారతీయ కార్మికులను గురువారం కొంతమంది ముష్కరులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం కంపెనీ ప్రతినిధులతో పాటు అక్కడి అధికారులు కూడా ధ్రువీకరించారు. కోబ్రీ సమీపంలోని విద్ద్యుదీకరణ ప్రాజెక్ట్‌ల్లో కిడ్నాప్‌కి గురైన కార్మికులు పని చేస్తున్నారు. గురువారం కొందరు అగంతకులు ఈ సిబ్బందిపై హఠాత్తుగా దాడులు జరిపారని, అనంతరం ఐదుగురు భారతీయ కార్మికులను అపహరించుకుని తీసుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా కిడ్నాప్‌లకు పాల్పడినట్లు ప్రకటించలేదు.ముందు జాగ్రత్త చర్యగా కంపెనీలో పనిచేస్తున్న ఇతర భారతీయులను రాజధాని బమాకోకు తరలించారు.ప్రస్తుతం మాలి సైనిక పాలనలో ఉంది. దేశంలో అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, నేర ముఠాల దాడులు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయి.   

విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లకు పాల్పడటం ఇక్కడ సాధారణంగా మారిపోయింది. 2012 నుంచి మాలిలో తిరుగుబాటులో ఘర్షణలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. సెప్టెంబర్‌లో కూడా ముగ్గురు విదేశీయలు కిడ్నాప్‌కి గురయ్యారు. అయితే కొంత డబ్బు చెల్లించిన అనంతరం గత వారు విడుదలైనట్లు తెలుస్తోంది.ఆఫ్రికన్ దేశం ప్రస్తుతం అల్ ఖైదా, ఐసిస్ తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో భారతీయుల కిడ్నాప్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.