09-11-2025 01:35:32 AM
ముంబై, నవంబర్ 8: తన కుమారుడు పార్ధ్ పవార్‌పై వచ్చిన భూ కుంభకోణం ఆరోపణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అ జిత్ పవార్ స్పందించారు. శనివారం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ పూణెలో తన సంస్థ కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వానికి చెందిన దని తన కుమారుడు పార్థ్‌కి తెలియదని స్పష్టం చేశారు. సంబంధిత భూమి ప్రభుత్వ భూమి, దానిని విక్రయించకూడదు అనే విషయం పార్థ్ మరియు అతని భాగస్వామి దిగ్విజయ్ పాటిల్‌కు ఈ విషయం తెలియదు అని అన్నారు. ప్రస్తుతం భూ కేటా యింపులు రద్దు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
భూ ఒప్పందానికి సం బంధించి నిజనిజాలు వెలికితీయడానికి ప్రభ్వుత్వం ఓ కమిటీ నియమించిందన్నారు. పూణే నగరంలోని మౌజే ముంధ్వాలోని సర్వే నెం 88కి సంబంధించిన ‘డాక్యుమెంట్ల అనధికారిక రిజిస్ట్రేషన్‘పై విచారణ జరిపి, రాష్ట్ర ఖజానాకు ఏదైనా ఆర్థిక నష్టం వాటిల్లిందా అని నిర్ధారించడానికి అదనపు ము ఖ్య కార్యదర్శి వికాస్ ఖర్గే నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ప్యానెల్‌ని ఏర్పాటు చేయాలని రెవెన్యూ మరియు అటవీ శాఖ ఉత్త ర్వులు జారీ చేసిందన్నారు.ఏసీఎస్ వికాస్ ఖర్గే నేతృత్వంలోని విచారణలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది.
ఎవరు బాధ్యులు అనేది బ యటకు వస్తుందని, ఒక నెలలోగా తన నివేదికను సమర్పిస్తుందని పవార్ చెప్పారు. కాగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగమైన నేషనలిస్ట్ కాంగ్రె స్ పార్టీ అజిత్ పవార్ ముంబైలోని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధికారిక నివా సంలో కలుసుకొని ఈ విషయంపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్థ్ పవార్ కంపెనీకి భూమి ని బదలాయించాలని అధికారులపై ఎవరూ ఒత్తిడి చేయలేదని చెప్పారు. ఈ భూ కుంభకోణంపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పార్థ్ పేరు లేదని పవార్ తెలిపారు.
పార్థ్ భాగస్వామి పాటిల్‌తో సహా మరో ముగ్గురి పేర్లు అందు లో ఉన్నాయని, వారు మాత్రమే పత్రాలపై సంతకాలు చేసేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు.ఈ కేసుపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్ అంటే అర్థం కూడా తెలియని వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రస్తు తం ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నవారిని వదిలిపెట్టేది లేదన్నారు. విచారణ నివేదిక అనంతరం దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా రూ.18వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పార్థ్ పవార్‌కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.300 కోట్లకే విక్రయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించగా, ఈ కేసులో తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌లను రాష్ట ప్రభుత్వం ఇప్పటికే సప్పెండ్ చేసింది.