16-10-2024 02:47:40 AM
విద్యారంగాన్ని రేవంత్ సర్కార్ భ్రష్టు పట్టించింది-
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి
సమస్యను పరిష్కరించకుంటే పోరాటాలు చేస్తం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): లక్షలాది మంది విద్యార్థుల జీవి తాలతో సర్కార్ చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. రాష్ట్రంలో విద్యారంగాన్ని రేవంత్ సర్కా ర్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందకుండా దూరం చేసే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదన్నారు. గురుకుల భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో యాజమానులు తాళా లు వేసి దుస్థితికి తెచ్చారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ఇవ్వకుండా మానసిక ఆందోళన కు గురిచేస్తున్నారన్నారు. బకాయిలు చెల్లించకపోవటంతో రాష్ర్ట వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేయటమంటే ఇంతకన్నా ప్రభుత్వానికి సిగ్గు చేటు ఏమీ ఉంటుందని మండిపడ్డారు. ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
విద్యార్థుల జీవితాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం వద్ద పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు కొనసాగించేందుకు అయ్యే డబ్బు లేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వకపోవటంతో వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూటలు పంపించే పనిలో బిజీ..
రేవంత్ రెడ్డి సర్కార్‌కు బాధలు తెలియకపోవడంతోనే విద్యార్థులు, కాలేజీ యాజ మాన్యాలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు లేడని, సీఎంకు విద్యారంగంలో సమస్యలను తెలుసుకునే ఓపిక లేద న్నారు. ఢిల్లీకి మూటలు పంపించే పనిలో రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నాడని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు స్కాలర్‌షిప్‌లను అం దించాలని డిమాండ్ చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు నష్టం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ సహిం చదని హెచ్చరించారు. రెండు మూడు రోజు ల్లో సమస్యను పరిష్కరించకుంటే విద్యార్థులతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు.