16-10-2024 02:49:21 AM
కేసీఆర్ ఇలాకా మెదక్‌పై పట్టు సాధించాలి
ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ కలి సి పనిచేస్తున్నాయని, దీనికి నిదర్శనమే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వ్యూహంతో పనిచేసి విజ యం సాధించాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మెదక్ అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యం త ప్రాధాన్యత ఉన్న జిల్లా అని, ఇక్కడ ఇంది రా గాంధీ ఎంపీగా పనిచేశారని అన్నారు.
కార్యకర్తలకు మెదక్ అంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉందని తెలిపారు. మెదక్ జిల్లా లో కేసీఆర్, హరీశ్‌రావు లాంటి బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారని, అందుకే అక్కడ కష్టపడి పనిచేసి పట్టు సాధించి సత్తా చాటాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా..
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్
ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాం గ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అద్భుతమైన పాలన చేస్తున్నారని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామని, ఉద్యోగాల కల్పన చేశామన్నారు.
ఉచిత బస్సు సౌకర్యం ద్వారా మహిళలు సంతోషంగా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 500 గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు మాఫీ, స్కిల్ యూనివర్సిటీ సహా అనేక కొత్త విధానాలు అమలు చేస్తున్నామని, వీటిని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉండేలా కృషి చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నియోజకవర్గ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవాలని, మంచి ఫలితాలు సాధించే దిశగా పనిచేయాలని సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.