30 June, 2026 | 11:04 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కనుగుట్ట గ్రామ రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి.

05-05-2026 08:49 PM

బోథ్,(విజయక్రాంతి): అగ్ని ప్రమాదంలో పంటలను కోల్పోయిన కనుగుట్ట గ్రామ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని దక్షిణ మధ్య రైల్వే బోర్డు మాజీ సభ్యులు జీవి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలు అని అగ్నిమాపక కేంద్రాన్ని ఇస్తామంటూ చెప్పి ఇంతవరకు ఇవ్వలేకపోయారన్నారు. బూత్ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిఏటా లక్షల రూపాయల ఆస్తులు బూడిదిపాలవుతున్నాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట బిజెపి మండల కన్వీనర్ బోరి రవీందర్ సహకార సంఘం మాజీ చైర్మన్ కదం ప్రశాంత్ సర్పంచులు మండల స్థాయి నాయకులు ఉన్నారు