26 February, 2026 | 12:03 PM

బంజారాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

26-02-2026 12:44 AM
  1. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సాహలు

అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలి

రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క.

ములుగు,ఫిబ్రవరి25(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి హరిత హోటల్ పక్కన తెలంగాణ ప్రభుత్వం సద్గురుసంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు .

రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని తెలిపారు.అనంతరం వారి సమావేశంలో సీతక్క మాట్లాడుతూ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం హర్షించదగ్గ విషయమని బంజారా కులస్తులు భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటా యించడం జరిగిందని వివరించారు. రానున్న రోజులలో ప్రభుత్వం వారి సంక్షేమం కోసం వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. సమావేశానికి ముందు మంత్రి సీతక్క బంజారా భాషలో మాట్లాడి అబ్బురపరిచారు.