26 February, 2026 | 9:56 AM

పరిషత్ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలి

26-02-2026 12:43 AM

దేవరకొండ, ఫిబ్రవరి 25: త్వరలో జరగనున్న జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు బీసీ సంఘం నాయకులు అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో 42% బీసీలకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి చట్టబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్లు ఏర్పాటు చేయడానికి 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చొల్లేటి భాస్కరాచారి, రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేష్, కడారి రాములు, భీమగోని శివ గౌడ్, బొమ్మిడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.