calender_icon.png 21 February, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేర్చాలి: ఎమ్మెల్యే జారే

21-02-2026 12:46:08 AM

అశ్వారావుపేట, ఫిబ్రవరి 20,(విజయక్రాంతి): అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గం మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు  శుక్రవారం స్వీకరించారు. ఈ సందర్భంగా  స్తానిక  ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నతమైందని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేయడం ప్రతి ప్రజాప్రతినిధి కర్తవ్యం అని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ నాగరాజు  పర్యవేక్షణలో చైర్మన్గా జూపల్లి శశికళ , వైస్ చైర్మన్గా జూపల్లి రమేష్, కౌన్సిలర్లుగా డేరంగుల ప్రసాద్, దగ్గుమాలి మౌనిక ,చిన్నంశెట్టి శ్రీను గారు కట్టా సింధుజ కొట్టే నాగసునీత, ఎస్.కె రెహనా ఎస్.కె నూర్జహాన్, మిండా హరిబాబు,  నార్లపాటి దివాకర్ గారు నార్లపాటి మహేష్, తిరుమలశెట్టి వెంకన్నబాబు,అట్టం రమ్య, మోర్ల రాజేశ్వరి ,కారం కనకదుర్గ ,దండాబత్తుల ఆదిలక్ష్మి , అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణంలో పారిశుద్ధ్యం తాగునీరు రహదారులు వీధి దీపాలు పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు . ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా బాధ్యతాయుతంగా సేవ చేయాలని తెలియజేశారు.