calender_icon.png 21 February, 2026 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ దేవాలయ హుండీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

21-02-2026 12:46:40 AM

పెట్రోలింగ్ పోలీసులను అభినందించిన ఎస్పీ

కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): హనుమను ఆలయ హుండీని చోరీచేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా తాడువాయి ఎస్త్స్ర నరేష్ తెలిపారు. శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. తాడ్వాయి శబరీ మాత ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కొండపై గల హనుమాన్ దేవాలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈనెల 19న  ఉదయం 4.00 గంటల సమయంలో  హనుమాన్ దేవాలయంలో చోరీ ఘటనపై పూజారి  శీతారాందాస్ త్యాగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు తెలిపారు. 

హోం గార్డ్ బాలాజీ, పోలీస్ కానిస్టేబుల్ అనిల్ పెట్రోలింగ్ విధుల్లో భాగంగా తాడ్వాయి గ్రామ పరిధిలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించి వెంటనే వెంబడించి పట్టుకున్నారు. విచారణలో అతను పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో  అతని షర్ట్పై తాజాగా ఉన్న కలర్ గుర్తించడం వల్ల మరింత అనుమానం కలిగింది. అతనిని పోలీస్ స్టేషన్కు తరలించి సాంకేతిక ఆధారాలతో పరిశీలించగా లింగంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన, గోడండ్ల పావులు గా గుర్తించారు.

నిందితుడు ను విచారించగా గతంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు దేవాలయ హుండీ చోరీ  కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఇటీవల పాత కేసులో బెయ్పి విడుదలైనట్లు విచారణలో వెల్లడించిన నట్లు ఎస్‌ఐ తెలిపారు. అతని వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించిన ఐరన్ రాడు,పగులగొట్టిన హుండీ తాళం, రూ. 200/- నగదు,  కలర్ మరకలు ఉన్న షర్ట్ స్వాధీనం చేసుకున్నట్లు  తెలిపారు. పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి, నిందితుడిని వెంటనే పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన హోం గార్డ్ బాలాజీ, పోలీస్ కానిస్టేబుల్ అనిల్  లను జిల్లా ఎస్పీ  అభినందించినట్లు తాడ్వాయి ఎస్‌ఐ నరేష్ తెలిపారు.