తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి
18-07-2026 06:24 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటున్నారని అటువంటి పాఠశాలను అభివృద్ధి చేసేందుకు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలో పోషకుల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యాబోధన మౌలిక సదుపాయాల కల్పన రైతు అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. వివిధ పాఠశాలలు నిర్వహించిన పోషకుల సమావేశానికి ఆయన హాజరై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చదువుపై మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






