6 July, 2026 | 9:14 PM

Breaking News

ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •  

ప్రభుత్వం ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

02-12-2024 07:57 PM

భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు నారెడ్డి వెంకటరెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షుడు నారెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేటలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రెండు లక్షల అరుణమాఫీ చేయాలని అదేవిధంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూడకుండా రుణమాఫీ రైతు భరోసా రైతులకు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సాంగ్ ప్రతినిధులు గోపు శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.